5, మార్చి 2018, సోమవారం

బ్రేకింగ్ జోక్​

బ్రేకింగ్ జోక్​

​భార్య :- ఏమండీ !​
మనం కూడా సీతా రాముడు లాగా ఇయర్ ఇయర్ పెళ్లి చేసుకుందామా..?

భర్త :- మరి మీ నాన్న కూడా సంవత్సరం సంవత్సరం కట్నం ఇస్తాడేమో అడుగు.
...
​భార్య :-....... ఆ ఆ ?????

🔺🔺🔺🔺🔺

🔸భార్య...
ఏమండీ! స్వర్గంలో భార్యాభర్తలను కలిసి ఉండనియ్యరంట!?

🔹భర్త...
ఓసి పిచ్చిదానా! అందుకే దాన్ని స్వర్గం అంటారే!!! 😜😜

🔺🔺🔺🔺🔺🔺

భర్త: ఒసేయ్ పెరుగన్నంలో పెరుగే కనిపించడం లేదు.....

భార్య: నస పెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉంటదేంటి ????😳😳😳

🔺🔺🔺🔺🔺🔺🔺

భార్య- ఏమండీ ! రేపు మనింటికి పేరంటానికి వచ్ఛే ఆడవాళ్ళ కి పసుపు కుంకుమ తో పాటు ఏమైనా ఇస్తే బావుంటుందండీ! ఏమివ్వను ?
భర్త - దాందేముంది . నా ఫోన్ నంబర్ ఇయ్యి.😜
🔺🔺🔺🔺🔺🔺🔺

భార్య : ఏమండీ ? పక్కింటాయన  వాళ్ళ ఆవిడని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంటా !               
 భర్త : ఆయనది పూల వ్యాపారమే...
నాది కారం పొడి వ్యాపారం...తీసుకు రమ్మంటావా ?
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

ప్రేమ అనే పదం లో....ప ర మ అనే అక్షరాల సమన్వయ శబ్దం

జయ శ్రీ మాతా!
ప్రేమ అనే పదం లో....ప ర మ అనే అక్షరాల సమన్వయ శబ్దం
వినిపిస్తుంది. అంటే ప్రాపంచికమైనది కాదు. కేవలం
ఆత్మ సంబంధం మాత్రమే. దీని అర్ధం జీవాత్మ-పరమాత్మను పొందటమే. అణువణువునా భగవంతుని దర్శించటమే .
అందరిలో దేవుని సేవించడమే.
యవ్వనంలోని ఆకర్షణ కాదిది.
లైంగిక సంపర్కం కానేకాదు.
షికార్లు తిరగడం అసలే కాదు.
ఒకర్నొకరు లోబరచుకోవటం/
సొంతం చేసుకోవాలని ఆరాటపడటం ససేమిరా కాదు.
ప్రేమ అంటే బంధం కాదు....
సంపూర్ణ స్వేచ్ఛ. ప్రేమ అనేది
కోరిక కాదు.....త్యాగం.
ప్రేమ అనేది మోహం కాదు...
మోక్షం. LIBERATION.
ప్రేమ అంటే 1+1 కాదు....
(1×1) ప్రేమ లో స్వార్థం లేదు.
అంతా పర హితార్థమే.
I ness కాదు 1 ( one)ness
ప్రేమ....పరమ ప్రేమ....
పరమ పవిత్రమైన పరమాత్మ ప్రేమ. ఇదేనా మనం చూస్తున్నది. ఇదేనా మనం
కోరుకుంటున్నది. ఈ ప్రేమలో
ఎడబాటు లేదు....విరహ వేదన
లేనే లేదు. అంతా 1(one)ness ...eternal bliss....God bless you all my dear friends.
Jaya Shree Matha.

అక్కడ ప్రమిద లేదు. వత్తి ఉండదు. నూనె పోయరు. అయినాసరే 24 గంటలు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది.

అక్కడ ప్రమిద లేదు. వత్తి ఉండదు. నూనె పోయరు. అయినాసరే 24 గంటలు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అక్కడ ఎవరూ తవ్వలేదు. నీళ్లు పోయరు. అయినాసరే జలధార ఉబికివస్తుంది. ఆ గుడిలో ప్రతిమలేదు. అమ్మవారి ఆకారం లేదు. కానీ వందలు వేల ఏళ్ల నుంచి వింతలకు కొదవలేదు. ఆ రహస్యాలను తెలుసుకోడానికి 175 ఏళ్ల నుంచి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. మరి ఇదంతా అమ్మవారి లీలనా? ఏదైనా రహస్యం ఉందా?
హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్డాలో ఉన్న జ్వాలాదేవీ ఆలయంలో జరిగే అద్భుతం ఇది. ఒకటి రెండు సంవత్సరాల నుంచి కాదు... వందలు వేల ఏళ్ల నుంచి ఇదే తంతు. వందల ఏళ్ల నుంచి జ్యోతులు వెలుగుతూనే ఉన్నాయి. వేల సంవత్సరాల నుంచి నీటి ధారలు ఉబికివస్తూనే ఉన్నాయి. పైన జ్యోతివెలుగుతుంటే కింద ఉన్న నీరు చాలా చల్లగా ఉండడం మరో విశేషం. గతంలో ఈ నీరు వేడిగా ఉండేదని... దీంతో వంట చేసేవారని అంటారు. అమ్మవారి కరుణవల్ల నీరంతా చల్లగా మారిపోయిందనేది భక్తుల విశ్వాసం.
ఈ గుడిలో అమ్మవారికి సంబంధించిన ఎలాంటి ప్రతిమ లేదు. అమ్మవారి ఆకారం కనిపించదు. అయినాసరే వందలు, వేల సంవత్సరాల నుంచి ఇక్కడ అద్భుతాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీని వెనుక భక్తి ఉంది. నమ్మకం ఉంది. అంతేకాదు ఛేదించలేని మిస్టరీ దాగుంది.
జ్వాలా ముఖిలో 11 చోట్ల జ్యోతులున్నాయి. ఇవి నూనె, వత్తులు లేకుండా 24 గంటల పాటు నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటాయి. వందల ఏళ్ల నుంచి జ్వలిస్తూనే ఉన్నాయి. ఇంతవరకు ఒక్కసారి కూడా ఆరిపోలేదు. వీటిలో ముఖ్య జ్యోతి నేల నుంచి మూడు అడుగుల లోపల ఉంది. ఈ జ్వాలనే అమ్మవారి ముఖం అని భక్తులు భావిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని జ్వాలా ముఖిగా పిలుస్తారు. ఈ జ్యోతులకే జనం పూజలు చేస్తారు. భజనలు చేస్తారు. హారతులిస్తారు. నైవేద్యం పెడతారు. వీటిని దర్శించుకోడానికి రోజంతా ఇక్కడ భక్తులు బారులు తీరుతారు.

ఒక అద్భుతమైన కథ...!

ఒక అద్భుతమైన కథ...!
""""""""""""""""""""""""""
స్టీఫెన్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్,
వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు.

రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.

కాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు.
మళ్ళి కొంతసేపు అయిన తరువాత,
విపరీతమైన గాలివాన, వర్షం..
దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేకఆగిపోయాడు.
భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ..ఆ డాక్టరు.

కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది.
ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు
ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె
తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని,
బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని,
వెచ్చగా ఉండేందుకు టీ,
కొంత ఆహారం తేబుల్ మీద పెట్టి తను ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళింది.

ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నా, ఆమె ప్రార్ధనలు ఎంతకీ పూర్తి అవటం లేదు.
ఎట్టకేలకు ఆమె ప్రార్ధనలు ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె చేసిన ప్రార్ధనలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు.

ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప,
ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది.

ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని,
తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు.

ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది.

"ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు.
అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది.
ఎంతో మంది వైద్యులకు చూపించాము.
ఎవ్వరూ నయం చేయలేకపోయారు.
ఒక్క స్టీఫెన్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు,
ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు.
అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి,
భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను
అని చెప్పింది.

వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు.
"భగవంతుడు దయామయుడు.
ఆయన మీ ప్రార్ధనలు వినడమే కాదు,
ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి,
గాలివానలో చిక్కుకుని,
నేను మీ ఇంటికి వచ్చాను.
కాదు కాదు,
ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు.
ఆ డాక్టర్ స్టీఫెన్ ను నేనే." అని బదులిచ్చాడు.

అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు.

ప్రార్ధన లోని మహత్యం అదే.
మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే.

1.అడగడం,
2. నమ్మడం,
3.అందుకోవడం...ఇవే ప్రార్ధనకు కావలసిన అంశాలు.

నమ్మి మనం ప్రార్ధిస్తే,
మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు.....
__/\_🙏🙏🙏

గో హత్య గురించి సుప్రీం కోర్టు లో జరిగిన వాద ప్రతివాదనలు..

🐄Important news.🐄      Please read total  msg
గో హత్య గురించి సుప్రీం కోర్టు లో జరిగిన వాద ప్రతివాదనలు.. దయచేసి ప్రతి ఒక్కరు చదవండి.. ఇతరులకు తెలియజేయండి

మాంసాహార విక్రేతలు చాలా పేరు ప్రతిష్టలున్న న్యాయవాదులను  ఈ కేసులో పెట్టుకున్నారు.  వారిలో కొంతమంది న్యాయవాదులు 35 లక్షల ఫీజు తీసుకునేవారున్నారు. మాంసాహారుల తరఫున కేసును వాదించిన వారిలో శ్రీ సోలి సోరాబ్జీ, ఫీజు ఇరవై లక్షలు, శ్రీ కపిల్ సిబాల్ ఇరవై రెండు లక్షలు, శ్రీ మహేష్ జీత్మలానీ 32 - 35 లక్షల దాకా తీసుకునే అగ్రగాములున్నారు. వీరంతా మాంసాహారుల తరఫున కేసును వాదించారు.

ఇఖ మన శ్రీ రాజీవ్ భాయికు న్యాయవాదిని పెట్టుకునడానికి తగినంత డబ్బు లేదు. హేమాహేమీలు మాంసాహారుల తరఫున వాదిస్తున్నారు. తన తరఫున వాదించటానికి అంత డబ్బులేదని కోర్టుకు విన్నవించిన తరువాత " కోర్టు మీకు న్యాయ సహాయం ఇస్తే ?" అని అడిగినప్పుడు " అది ఆనందమే కానీ, మా కేసు మేము వాదించుకొనడానికి అనుమతించాలని" శ్రీ రాజీవ్ భాయి కోరారు. అలా అనుమతిస్తునే, కోర్టు శ్రీ M E ఎస్కురి అనే న్యాయవాదిని ఈ కేసులో న్యాయ సహాయం కోసం నియమించింది.  ఇఖ కేసు కొనసాగింది.

  ఈ మాంసాహార విక్రేతల వాదనలు శరద్ పవార్, నెహ్రు మొదలైనవారి వాదనల కన్నా భిన్నంగా ఏమీ లేవు. అవి ఆ మెకాలే చదువుల ప్రభావంతో మన విద్యారంగాన్ని కలుషితం చేసిన పదాల గారడీ వాదనలే.  వాట్సప్ లో జాజిశర్మకు వచ్చిన ఆంగ్ల పాఠానికి జాజిశర్మ చేసిన స్వేచ్ఛానువాదం చదవండి.

వారి వ్యర్ధవాదనలేమిటో చూద్దాం.

  మొదటి వ్యర్ధవాదన:  గోవును రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక వ్యవస్ఠ బలపడుతుంది.

   రెండవ వ్యర్ధవాదన:  గోవులకు, ఇతర జంతువులకు తగినంత గ్రాసం ఈ దేశంలో లేదు. అవి ఆకలితో చచ్చేకన్నా వాటిని చంపటం మంచిది.

  మూడవ వ్యర్ధవాదన:  మనదేశంలో మనుష్యులకే చోటు లేదు. పశువులను ఎలా పోషిస్తాం.

  నాలుగవ వ్యర్ధవాదన:  మనకు అత్యంత విలువైన విదేశీ మారక ద్రవ్యం మాంసాహార ఎగుమతల వలన వస్తుంది.

   ఐదవ వ్యర్ధవాదన:  మాంసాహారం తినడం మతపరమైన హక్కు .

   ఈ వ్యర్ధవాదనలు చేసిన వారిలో ముస్లీం మతము లోని "ఖురేషీ" అనే వర్గము వారు ఎక్కువ హింసకు పాల్పడేవారే. వారే ఈ వ్యర్ధ వాదనలు చేసిన ప్రప్రధములు. 

  ఈ వ్యర్ధ వాదనలన్నిటికీ శ్రీ రాజీవ్ భాయి అత్యంత సహనముతో , నిగ్రహముతో అన్ని వివరాలతో గణాంకములతో సహా కోర్టు వారి ముందుంచారు.

ఆ వ్యర్ధవాదనలకు శ్రీ రాజీవ భాయి సమాధానాలు ఏమిటో ఒకటి తరువాత ఒకటి చూద్దాం ( చదువుదాం ) పదండి.

  గోవును రక్షించి ప్రయోజనం ఏమీ లేదు. గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్ధిక వ్యవస్ఠ బలపడుతుంది.

    ఈ వ్యర్ధవాదనను శ్రీ రాజీవ్ భాయి గణాంకాలతో కోర్టువారికి ఇలా వివరించారు.
        ఒక గోవును చంపితే ఎంత మాంసం వస్తుంది, ఎంత రక్తం, ఎన్ని ఎముకలు అనే గణాంకాలతో ఈ వివరణ సాగింది.

          ఒక ఆరోగ్యం గా ఉన్న గోవు 3 నుండి 3.5 క్వింటాళ్ల బరువుంటుంది. దానిని చంపితే షుమారు 70 కిలోల మాంసం వస్తుంది. కిలోకి 50 రూపాయల చొప్పున మాంసం ఎగుమతి వలన లభించే డబ్బు రూ. 3,500/-. ఆవు రక్తానికి లభించే రొక్కం రూ.1500/- నుండి రూ.2000 వరకు. ఇఖ 30-35 కిలోల ఎముకలకు లభించే రొక్కం 1,000 నుండి 1,200/- . ఏతావాతా ఒక గోవును చంపి వీరు దేశానికి కానీ, వారి స్వార్ధానికి గానీ, సంపాదించే మొత్తం డబ్బు రూ.7000/-

ఈ వ్యర్ధ వాదనను శ్రీ రాజీవ్ భాయి తన గణాంకాలతో శక్తివంతంగా ఎలా  తిప్పికొట్టారో చదవండి. ఆ గణాంకాలు ఇలా ఉన్నాయి.

      ఒక ఆరోగ్యమైన గోమాత రోజుకి  పదికిలోల గోమయం, ( ఆవుపేడ ), మూడు లీటర్ల గోమూత్రం ఇస్తుంది. ఒక కిలో గోమయం తో 33 కిలోల ఎరువు తయారు అవుతుంది. దీనినే మనం సేంద్రీయ ఎరువు అంటాము. శ్రీ రాజీవ్ భాయి ఇలా చెపుతూంటే కోర్టు వారు " ఇది ఎలా సాధ్యం " అని అడిగారు. ఆయన తన వాదనను నిరూపించటానికి కొంత సమయం కావాలన్నారు.
దానికి ధర్మాసనం ఒప్పుకున్న తరువాత శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో గోమయంతో 33 కిలోల సేంద్రీయ ఎరువును తయారు చేసి కోర్టువారికి చూపించి, I R C  శాస్త్రవేత్తలను పిలిపించి తను గోమయంతో తయారుచేసిన సేంద్రీయ ఎరువును పరీక్షింపచేశాడు. కోర్టువారి ఆధ్వర్యంలో ఆ శాస్త్రవేత్తలు సేంద్రీయ ఎరువును పరీక్షచేసి ఈ సేంద్రీయ ఎరువు అత్యుత్తమ ఎరువుగా నిర్ధారించారు. ఈ సేంద్రీయ ఎరువు భూమికి కావలసిన 18 సూక్ష్మపోషకాలు అన్నీ చ్ ఆ శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఈ సూక్ష్మపోషకాలలో సాగుచేసే క్షేత్రానికి కావలసిన , మాంగనీసు, ఫాస్పేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కొబాల్ట్, సిలికాన్, మొదలైనవన్నీ ఉన్నాయని నిర్ధారించారు. రసాయినిక ఎరువులలో కేవలం మూడు ఖనిజాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి గోమయం ద్వారా తయారైన, సేంద్రీయ ఎరువు రసాయన ఎరువులకన్నా పదిరెట్లు గుణవర్ధకమైనది అని శ్రీ రాజీవ్ భాయి తన వాదనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనను ఒప్పుకున్నది.

శ్రీ రాజీవ్ భాయి తన వాదనను కొనసాగిస్తూ, కోర్టుకి అభ్యంతరం లేకపోతే, తను, తన కుటుంబ సభ్యులు ఒక కిలో గోమయము నుండి, 33 కిలోల సేంద్రీయ ఎరువులు ఎలా చేస్తున్నారొ, తన ఊరు వచ్చి, గత 15 సంవత్సరాలుగా తమ కృషిని చూడమని అహ్వానించారు.

తన వాదనలో శ్రీ రాజీవ్ భాయి ఒక కిలో సేంద్రీయ ఎరువు అంతర్జాతీయ విపణిలో ఆరు రూపాయలు (ఇది అతి తక్కువ ధర), అనుకుంటే, ఒక రోజుకు గోమాత రూ.1,800/- నుండి రూ.2,000/- దాకా ఆదాయము తెచ్చి పెడుతుంది.  ( ౩౩ కిలోల ఆవు పేడ నుండి  330 కిలోల సేంద్రీయ ఎరువు తయారు అవుతుంది కదా ! 330 X Rs.6/- ).  పైగా ఈ గోమయం వేసే మాతలకు ఆదివారాలు కానీ, శెలవులు కానీ లేవు కదా ! ఈ లెక్కన గోమాత వలన  ఒక సంవత్సరములో అంటే 365 రోజులలో వచ్చే ఆదాయం 1800 X 365 = Rs.6,57,000/- ఇదంతా గోమయము వలన అంటే "ఆవు పేడ" వలన వచ్చే ఆదాయం.

రమారమి 20 సంవత్సరాలు జీవించే గోమాత వలన వచ్చే ఆదాయాన్ని, శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన గణాంకాలు చూసి అందరూ అవాక్కయ్యారు. ఒక గోమాత తన జీవిత కాలంలో వచ్చే ఆదాయము దాదాపు Rs.1,31,40,000/- ( అక్షరాల ఒక కోటి ముప్పై ఒక్క లక్షల నలభై వేలు ) చ్ దాటిపోవడం చూచి ఆశ్చర్యచకితులయ్యారు.

వేల సంవత్సరాల పూర్వం మన పురాణాలలో గోమయంలో "లక్ష్మి" నివసిస్తుంది అని పూర్వీకులు ఎందుకు ప్రవచించారో శ్రీ రాజీవ్ భాయి సశాస్త్రీయంగా సుప్రీంకోర్టులో గణాంకాల ద్వారా నిరూపించారు.

ఇది మన పురాణగంధ్రాలను హేళన చేసిన వారికి చెంపపెట్టు. "మెకాలే" చదువులు వంటబట్టించుకున్న వారు ఎన్నో ఏళ్ళుగా మన పురాణాలు "గోమయం లో "లక్ష్మి" నివాసముంటుంది అంటే , వీళ్ళు మూర్ఖులు, వీళ్ళ సంస్కృతి ఇంతే, వీళ్ళు ఇలాగే మోసపూరిత మాటలు చెబుతారు అని నవ్విన వారి మొహాలు "తెల్లబోయి" నొళ్ళు వెళ్ళబెట్టారు.

ఇఖ "గోమూత్రము" మీద శ్రీ రాజీవ్ భాయి తన వాదన అద్భుతమైన రీతిలో కొనసాగించారు.

   " ఒక గోవు రోజుకి 2 లేక 2.25  లీటర్ల దాకా మూత్రము విసర్జిస్తుంది. ఈ గోమూత్రం అనేక రకాల వ్యాధులకు , మధుమేహానికి,  మధుమేహము, క్షయ, కీళ్ళ వాతము, కీళ్ళకు సంబంధించిన అన్ని రోగాలు, ఎముకల మూలుగుకు సంబంధించిన వ్యాధులు మొదలైన  48 రకాలైన  రోగాలన్నీ సమూలంగా నిర్ములించ గలదని ఆ గోమూత్రం ద్వారా తయారు చేసిన ఆయుర్వేద మందులు, తెలుపుతున్నాయి. ( చరక మహర్షి తన సంహిత లో గోమూత్రము ఉపయోగాలన్నీ ఎంతో వివరంగా చెప్పాడు. )

గణాంకలు సమర్పిస్తూ, శ్రీ రాజీవ్ భాయి ఇలా చెప్పారు. ఒక లీటరు గోమూత్రం భారతీయ విపణీ లో రూ.500/-లు గా ఉన్నది. అంతర్జాతీయ విపణిలో ఈ రేటు ఇంకా ఎక్కువ ఉన్నది. అమెరికాలో గోమూత్రం "పేటెంటు" కూడా చెయ్యబడింది. గోమూత్రానికి మూడు పేటెంట్లు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం గోమూత్రాన్ని భారతదేశము నుండి దిగుమతి చేసుకుని, కాన్సర్ కు, మధుమేహానికి మందులు తయారు చేసుకుంటున్నది. 

అమెరికాకు ఎగుమతి చేసే గోమూత్రపు రేటు ప్రస్తుతం ( వాదనలు జరిగేటప్పుడు) ఒక లీటరు రూ.1,200/- నుండి రూ.1,300 దాకా ఉన్నది. ఆ లెక్కన  గోమూత్రం వలన ఆదాయం రోజుకు రూ.3,000/- , వార్షిక ఆదాయం
రూ.3000/- X 365 = రూ.10,95,000/- , ఒక గోవు తన జీవిత కాలమైన 20 సంవత్సరాలలో కేవలం గోమూత్రం మీద ఇచ్చే ఆదాయం 3000X365X20 = 2,19,00,00 ( అక్షరాల రెండు కోట్ల పంతొమ్మది లక్షల రూపాయలు ) .గోమూత్రము వలన కోట్ల ఆదాయం.

ఇదే గోమయం  " మిథైన్ " అనే వాయువు ఉత్పత్తి చేస్తుంది. దీనిని మనం మన వంటగదిలో పచానానికి వాడుకోవచ్చును.మన ద్విచక్ర  వాహానాలను నడుపుకోవచ్చును. మన కార్లు కూడా ఈ వాయువును ఉపయోగించి నడుపుకోవచ్చును.

ఈ వాదన  ధర్మాసనం లోని ఒక న్యాయధీశుడు నమ్మలేక పోయారు. అప్పుడు శ్రీ రాజీవ్ భాయి " మీరు అనుమతిస్తే, మీ  కారుకు మితైన్ గాస్ సిలిండర్ అమరుస్తాను. మీరే పరీక్షించండి. మీ కారు మీరే డ్రైవ్ చెయ్యండి. " అని తన వాదన పటిమ చూపించారు. ఆ న్యాయాధీశుడు  అనుమతించి, తన కారును మూడు నెలలు మిథైన్ వాయువు తో నడిపారు. తన కారుకు కిలో మీటరుకు యాబై, నుండి అరవై పైసల కంటే ఎక్కువ ఖర్చు  కాకుండా చూచి ఆయన నివ్వెర పోయాడు. అంతకు ముందు ఆయన కిలోమీటరు డీజల్ కు నాలుగు రూపాయలు ఖర్చు చేశారు. పైగా డీజల్ లాగా పొగ లేదు. శబ్ద, వాతావరణ కాలుష్యాలు అసలే లేవు.
ఆ న్యాయధీశుడు సంతృప్తి చెందాడు. శ్రీ రాజీవ్ భాయి చెప్పినది వాస్తవమని ఒప్పుకున్నాడు.

శ్రీ రాజీవ్ భాయి గణాంకాలు అక్కడితో ఆగలేదు. రోజు వచ్చే  పది కిలోల గోమయం తో ఎంత మిథైన్ వాయువు తయారు అవుతుందో , అది 20 సంవత్సరాలలో ఎంత దేశానికి పొడుపు చేస్తుందో చెప్పి ధర్మాసనమునకు తన గణాంకాలు సమర్పించాడు. దేశంలో ఉన్న 17 కోట్ల గోవుల వలన  దాదాపు ఒక లక్ష 32 వేల కోట్ల ధనం పొదుపు అవుతుంది. మన రవాణా మొత్తం మిథైన్ ఆధారితమవుతే, అరబ్ దేశాల నుండి మనము పెట్రోల్ గానీ, డీసెల్ గానీ, దిగుమతి చేసుకోనఖర్లేదు. మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టనఖర్లేదు. మన రూపాయి అంతర్జాతీయంగా బలపడుతుంది. ఇది తల్లి గోమాత వలన సాధ్యం. ఆ మాత "శ్రీలక్ష్మి "యే !!

   ఈ వాదన విని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ఘాంతపోయి, ఉప్పెనలా శ్రీ రాజీవ్ భాయి ఇచ్చిన  గణాంకాలు అన్నీ శ్రద్దగా పరిశీలించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం శ్రీ రాజీవ్ భాయి చెప్పిన వాదనను "సత్యము" అని అంగీకరించి, " గోమాతను సంరక్షించడమే " దేశానికి ఆర్ధికంగా మంచిదని, గోమాత వలననే భారత దేశానికి ఆర్ధికపుష్టి లభించగలదని అంగీకరించారు.
సుప్రీంకోర్టు శ్రీ రాజీవ్ భాయి వాదనలను అంగీకరించే సరికి, మాంసాహారుల తల బొప్పికట్టి, దిక్కు తోచలేదు. కేసు వారి చేతుల్లో నుండి జారిపోతోంది అని గ్రహించారు. ఎందుకంటే వారు గోవు రూ.7,000/- వేల కంటే ఆదాయం ఇవ్వదని అంతకు ముందే కోర్టుకు చెప్పారు. ఇప్పుడు శ్రీ రాజీవ్ భాయి, గోమాత కోట్లాది రూపాయాలు ఆర్జించి పెడుతుంది అని ఋజువు చేశారు.

అప్పుడు మాంసాహారులు తమ తురుపు ముక్క వేశారు. అది " గో మాసం తినడం వారి ఇస్లాం  మతపరమైన హక్కు " అనే వాదన లేవదీశారు.  శ్రీ రాజీవ్ భాయి "అయితే, ఎంత మంది ఇస్లాం పాలకులు ఈ మతపరమైన హక్కును వాడుకున్నారు? ఈ మతపరమైన హక్కు చెప్పే ఇస్లాం గ్రంధాలు ఏమిటీ" అనే ప్రశ్నలు కోర్టు పరిశీలించాలి అని కోరారు.

అప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశాలు పరిశీలించడానికి ఒక విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ కి ఈ అంశాలను కూలంకషంగా పరిశీలించాలని ఆదేశించారు. " ఇస్లాం పాలకులు, మతగ్రంధాలు  గో మాంసము తినడం మీద ఏమి చెప్పాయో ? ఆ హక్కు అనేది ఉన్నదో లేదో తేల్చి చెప్పమని " ఈ కమిటీ ని ఆదేశించారు.

ఈ కమిటీ చారిత్రాత్మక పత్రాలను శోధించి, తేల్చి చెప్పినది.

     " ఇస్లాం పాలకులు ఎవరూ గోవధను సమర్ధించలేదు. నిజానికి కొంతమంది పాలకులు గోవధకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశారు. వారిలో ప్రధముడు "బాబర్ " ఆయన తన  "బాబర్ నామా" లో గోవధ నేరమని, ఆలాంటి నేరం తను చనిపోయినా  ఈ దేశంలో  జరగకూడదు అని వ్రాసి, తను చేసిన చట్టం కొనసాగాలని పేర్కొన్నాడు. ఆయన సంతతి వారంతా, హుమాయున్ అదే చట్టం కొనసాగించారు. చివరకు హిందూ సంప్రదాయాలను క్రూరంగా అణచివేసిన ఔరంగజేబ్ కూడా ఈ గోవధని వ్యతిరేకిస్తూ, తన పూర్వీకులు చేసిన చట్టాన్ని కొనసాగించాడు.

ఇక్కడ దక్షిణాపధం లో టిప్పు సుల్తాన్ తండ్రి, హైదర్ ఆలీ గోమాతను వధ చేసే వాడు కనపడితే "వాడి తలకాయ నరకమన్నాడు". చాలా మంది ఈ శిక్ష లో బలయ్యారు. టిప్పు సుల్తాన్ రాజు కాగానే, ఈ చట్టాన్ని కాస్త మార్చి , గోవధ కు పాల్పడిన వారి" చేతులు నరకమన్నాడు".
.
  సుప్రీకోర్టు నియమించిన కమిటీ ఇలా తన రిపోర్ట్ సమర్పించగానే, శ్రీ రాజీవ్ భాయి,  వాదన కు మరింత పుష్టి వచ్చింది.

   " గోవధ ఇస్లాం మత హక్కు అయితే, ఇస్లాం శిరసాదాల్చి పాలించిన చక్రవర్తులు బాబర్, హుమాయున్, చివరకు ఔరంగజేబ్ గోవధ కు వ్యతిరేకంగా చట్టాలను చేసి, ఎలా కొనసాగించారు" అని సూటిగా ప్రశ్నించారు.

తరువాత శ్రీ రాజీవ్ భాయి తన అత్యంత కీలక వాదన మొదలు పెట్టారు. సుప్రీకోర్టు అనుమతితో పవిత్ర ఖురాన్, హదీద్, మిగతా ఇస్లాం పవిత్ర గ్రంధాలు గోవధ గురించి ఏమి చెప్పాయో పరిశీలించమని కోరారు. ఏ ఇస్లాం గ్రంధము కూడా గోవధ ను సమర్ధించలేదు. సరికదా , హదీద్ లు , " గోవును రక్షించ మని, అవి మిమ్మల్ని రక్షిస్తాయి " అని పేర్కొన్నాయి. మహమ్మద్ ప్రవక్త గోవు అమాయక ప్రాణి అని , పత్రివారు దాని పట్ల దయ గలిగి ఉండాలి అని ప్రభోదించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనములో " గోవును వధించిన వాడికి నరకం లో కూడా స్థానం లేదు " అని చెప్పారు.

తన వాదనను ముగిస్తూ, శ్రీ రాజీవ్ భాయి, పవిత్ర ఖురాన్, మహమ్మద్ ప్రవక్త, హదీద్ లు , గోవధ ను వ్యతిరేకిస్తుంటే, గోవధ ఇస్లాంమత హక్కు ఎలా అవుతుంది.  ఈ మాంసాహారులను, మక్కా, మదీనా లలో ఏదైనా పుస్తకంలో గోవధ చెయ్యమని ఉన్నదేమో చూడమని చెప్పండి. అలా ఉన్నదని నాకు తెలియదు. ముస్లిం మత పెద్దలకు తెలియదు." అని ముగించారు.

మాంసాహారులు మాన్పడిపోయారు.  సుప్రీకోర్టు మాంసాహారులను , పదే పదే  అడిగింది.  వారు ఇస్లాం లో గోవధ చెయ్యమని చూపెట్టలేక పోయారు.

సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం  ఈ అత్యంత కీలకమైన కేసులో  26 అక్టోబర్ 2005 న తన తీర్పును ప్రకటించింది,

ఈ తీర్పును మీరు సుప్రీకోర్టు వెబ్సైటు లో చూడవచ్చును.
.

తన 66 పేజీల తీర్పుతో సుప్రీంకోర్టు ఒక చరిత్ర సృష్టించింది తన తీర్పులో ఇలా పేర్కొంది.

    "  గోవధ రాజ్యాంగ రీత్యా, మతపరంగా కూడా పాపం. ప్రతి పౌరుడు, ప్రభుత్వము,   గోవును రక్షించడం  రాజ్యాంగ ధర్మముగా భావించాలి. మనం మన రాజ్యాంగములో , " రాజ్యాంగ ప్రకారం నడచుకుంటామని, మన జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని, మన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవిస్తామని, మన సారభౌమత్వాన్ని రక్షించుకుంటూ, మన ఐకమత్యాన్ని పాటిస్తూ, ఈ దేశ సమగ్రతను పటిష్టంగా చెయ్యాలని రాజ్యాంగము వ్రాసుకున్నాము. ఇప్పుడు దానిలో గోసంరక్షణ కూడా చేరింది. "
సుప్రీంకోర్టు తన తీర్పులో " 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ గో సంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికి  ప్రతి ముఖ్యమంత్రి, గవర్నర్, ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలి" అని స్పష్టంగా పేర్కొన్నది.

చివరగా శ్రీ మంగళ్ పాండే చేసిన త్యాగాలను మరిస్తే, మనం కృతఘ్నులుగా మిగిలిపోతాం. శ్రీ మంగళ్ పాండే గోసంరక్షణ కోసం గోమాసం పోతతో తయారు చేసిన తుపాకీగుండును నోటిలో పెట్టుకోవడం సహించక, ఒక బ్రిటీషు ఆఫీసర్ ను కాల్చి చంపాడు. అదే మన ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామానికి దారి తీసిన ఘటన, గో సంరక్షణతో మొదలయ్యింది.

గో సంరక్షణ ప్రతి భారతీయుని కర్తవ్యం . అది రాజ్యాంగబద్దమైనది. ఎక్కడైనా ఈ తప్పు జరిగితే ఆ తప్పు అడ్డుకోవడం నేరము కాదు.

#SwamiParipoornanandaAwareness

నాణెం పై తెలుగు భాష.

నాణెం పై తెలుగు భాష.

ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు భాషకు పట్టం కట్టారు.

ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు ” ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య ” ను సభ దృష్టికి తీసుకువచ్చారు.

పట్టాభీ ! నువ్వు ‘ ఆంధ్ర రాష్ట్రం,,, ఆంధ్ర రాష్ట్రం,,, ‘ అని ఎప్పుడూ అంటూ ఉంటావు… అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ? … మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ పటేల్ గారు ఎగతాళిగా మాట్లాడారు.

అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి అణా కాసును తీసి ” సర్ధార్ జీ ! దీనిపై ‘ ఒక అణా ‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ … జాతీయ భాష అయిన హిందీలోనూ … దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోనూ… ఆ తర్వాత ‘ ఒక అణా ‘ అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం. (అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు)… మరి ఈ నాణెం పై మా ‘ తెలుగు భాష ఉంది… కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే ??? అంటూ చురక వేశారు. పటేల్ గారు ఆశ్చర్యపోయారు. ఆ మాటలు విన్న గాంధీజీ కూడా చిరునవ్వుతో ఉండిపోయారు. మహాత్మా గాంధీ గారి మాతృభాష కూడా గుజరాతీ భాషే.

భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే… తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పదనాన్ని గుర్తించి, వారు ముద్రించిన నాణెల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, ప్రపంచం లో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష, తెలుగు భాష లను ప్రవేశ పెట్టి, మన తెలుగు చరిత్ర గొప్పదనం అందరికి తెలియపర్చారు.

మూడు జల్లెడ్ల పరీక్ష

మూడు జల్లెడ్ల పరీక్ష
(ఇప్పటితరానికీ ఉపయోగపడే కధ.)

ఒక సారి ఉత్తమ బ్రాహ్మణుడైన చాణిక్యునిదగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను “మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)” అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.

మొదటి జల్లెడ “నిజం” – “నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని అడిగాడు.

అందుకు ఆ స్నేహితుడు “లేదు, ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు.
“అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు.

సరే రెండో జల్లెడ “మంచి ” – ” నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?” అని అడిగాడు చాణిక్యుడు,

“కాదు” అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .

“అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం”అన్నాడు చాణిక్యుడు.

మూడో జల్లెడ “ఉపయోగం” – “నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? ” అని చాణిక్యుడు అడిగాడు.

“లేదు” అన్నాడు ఆ మిత్రుడు.

“అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?” అని అన్నాడు చాణిక్యుడు

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.

స్నేహానికి విలువ తెలిసిన వారికి మాత్రమే  ఈకథ!

శుభంభూయాత్ః…

“కర్మ మరియు విధి”

🕉🕉🕉🕉🕉🕉

“కర్మ మరియు విధి” ఎలా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయో ఒక కథ ద్వారా తెలుసుకుందాం.

దేవఋషి నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ శ్రీ మహా విష్ణువును కలవడానికి వైకుంఠం చేరాడు. శ్రీ మహా విష్ణువును చూసి ప్రణామం చేసి, “నారాయణ, మనుష్యుల్లో నీ యందు భక్తి తగ్గినది, భూలోకంలో ధర్మమూ పాటించు వారు కష్టాలు ఎదురుకొంటున్నారు, పాపమూ చేసిన వారు సుఖమైనా జీవితం గడుపుతున్నారు” అని అన్నాడు.

మహా విష్ణువు, “నారద, ధర్మమూ ఎపుడైనా గెలుస్తుంది నాయన, ఏది జరిగిన విధి అనుసారంగా జరుగుతుంది”.

అప్పుడు నారదుడు, ” దేవా, నేను నా కనులార చూచితిని, పాపమూ చేయువాడు అన్ని రకాల సుఖములు పొందుతున్నాడు, ధర్మబద్ధంగా జీవించువాడు మరింత కష్టాలపాలు అవుతున్నాడు” అని అన్నాడు.

అసలు నీవు చూసిన సంఘటన ఏమిటో చెప్పు అని మహా విష్ణువు అడిగెను.

అప్పుడు నారదుడు, ” ఒకానొక అరణ్యములో నేను వెళ్తూ ఉండగా ఒక ఆవు ఊబి లో చిక్కుకొని కనపడింది, నిస్సహాయ స్థితిలో అది సహాయము కొరకు అరుస్తుంది. కొద్దీ సమయానికి అటువైపుగా ఒక దొంగ వచ్చాడు వాడు ఆవును చూసి ఏమి పట్టనట్టు దాని మీద కాలు పెట్టి ఊబి దాటి వెళ్ళాడు, కొద్దీ దూరం వెళ్ళాక ఆ దొంగకు ఒక మూట దొరికినది దాని నిండా బంగారు నాణ్యాలు ఉన్నవి”.

మరి కొద్దీ సమయానికి అటుగా ఒక ముని వచ్చాడు, ఆవును చూసి జాలిపడి తన శక్తిని కూడా గట్టుకొని ఎంతో కష్టపడి ఆవును బయటకు తీసాడు, ఆ సాధువు తన మార్గమున ముందుకు వెళ్లి ఒక గోతిలో పడ్డాడు”.

ఓ కరుణాకర ఇప్పుడు చెప్పండి “ఆవుకు సహాయము చేసి ప్రాణం కాపాడిన సాధువు గోతిలో పడ్డాడు, ఏ సహాయము చేయని దొంగకు బంగారము దొరికింది. ఇదెక్కడి న్యాయం?”

శ్రీ మహా విష్ణువు అన్నాడు, “ఈ సంఘటనలో దొంగకు సాధువుకు జరిగినది సరియైనదే. ఆ దొంగకు నిజానికి అదృష్టం వలన ఒక పెద్ద నిధి దొరకవలసినది కానీ అతను చేసిన పాపం వలన కేవలం ఒక మూట బంగారం దొరికినది. ఆవును కాపాడిన సాధువు నిజానికి ఆ రోజు మరణించవలసింది కానీ ఆవును కాపాడిన పుణ్యము వలన చావును తప్పించుకొని కొన్ని దెబ్బలతో ప్రాణాలతో బయటపడ్డాడు”.

మనిషి చేసే ప్రతి కర్మ అతని విధిని నిర్ణయిస్తుంది, కర్మల చేత విధిని కూడా మార్చవచ్చు.

🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻

🕉🕉🕉🕉🕉🕉

ఏడు చేపల కధ అర్ధం పరమార్ధం.

ఏడు చేపల కధ అర్ధం పరమార్ధం...

వీలైనంత ఓపికగా చదవండి...

ఏడు చేపల కథ చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ.

అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.

ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.

వేటాడిన చేపలను ఎండబెట్టారు.

 అందులో ఒక చేప ఎండలేదు.

చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు.

గడ్డిమేటు అడ్డొచ్చింది అంది.

గడ్డిమేట ?

గడ్డిమేటా ఎందుకు అడ్డొచ్చావ్‌ అని అడిగారు.

ఆవు మేయలేదు అంది.

ఆవా, ఆవా ఎందుకు మేయలేద  అని అడిగారు?

గొల్లవాడు నన్ను మేపలేదు అంది.

 గొల్లవాడా⁉

గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారు.

అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.

 అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు❓అని అడిగారు.

పిల్లవాడు ఏడ్చాడు అంది.
పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావ్‌ ❓
అని అడిగారు.

చీమ కుట్టింది అన్నాడు.
చీమా టీమ్ ఎందుకు కుట్టావ్‌❓అన్నారు.

 నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.

ఎన్నో అసహజాలు, అసంగతాలు అయిన సన్నివేశాలు ఉన్నా, ...
రీజనింగ్‌ అడగకుండా, ఆలోచించకుండా వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడు చేపల కథ.

నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది.

 అడవికిపోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా!

అయినా ఎవ్వరూ ఈ ప్రశ్న వేయరు.

 చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం.

వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా⁉

నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్‌ ప్రశ్న. అయినా ఎవ్వరూ ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు.

ఎవ్వరూ అడగలేదు కదా అని రీజనింగ్‌ ఇవ్వకపోవడం ఒక మంచి రచయిత లక్షణం కాదు.

అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే, చదువుకుంటే అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి.

రాజుగారు అంటే మనిషి.

ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.

కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.

 జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.

రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే సప్త వ్యసనాలు.

ఏమిటా వ్యసనాలు❓

కామం, వేట, జూదం, మద్యపానం, వాక్పారుష్యం (కఠినంగా, పరుషంగా మాట్లాడడం), దండ పారుష్యం (తీవ్రంగా దండించడం), అర్ధదూషణం (ధనాన్ని దుబారాగా ఖర్చు చేయడం),

వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు.

 అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.

వీటిని ఎండగట్టాలి అంటే ఎవరికి వారే చేయాలి తప్ప, వేరే ఎవరో చేయ కూడదు.

అందుకే కథలో ఏడు చేపలను రాజుగారి కొడుకులే ఎండగట్టినట్టు చెప్పారు.

ఈ నాటి సమాజంలో కామం, వేట, జూదం, మద్యం, దుర్భాష, ధనవ్యయం ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అందరం చూస్తూనే ఉన్నాం.

 పైన చెప్పిన సప్త వ్యసనాలు మనిషిని ఎలా పీడిస్తున్నాయో, సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయో కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం.

రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.

ఏమిటా చేప. అది కామం.

దీన్ని జయించడం చాలా కష్టం.

ఎంత ప్రయత్నించినా అది ఎండదు.

కామం అంటే ఏమిటి❓

లోకం అనుకునే సెక్స్‌ కాదు, కోరిక.

కోరిక ఒక పట్టాన చావదు.

ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.

 మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.

 కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.

మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.

 అందుకని కోరికలను జయించడం అసాధ్యం.

ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.

ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓
గడ్డిమేటు.

గడ్డిమేటు అంటే ఏమిటి❓
కుప్పకోసిన అజ్ఞానం.

 మన అజ్ఞానం కొండలాగా పేరుకుపోతే దాని నీడన ఎన్ని కోరికలైనా బ్రతుకుతాయి.

 గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా❓

మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.

 కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼

ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.

 మనిషి లో నేనున్నాను అన్న అహంకారమే గడ్డిమేటు.

దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.

 మరి అది పోవాలంటే ఏం చేయాలి❓

ఆవు వచ్చి మేయాలి.

 ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓

ఆవు అంటే జ్ఞానం.

 జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.

 లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.

అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు
 (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం)

జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.

మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి❓

సామాన్యుడు జ్ఞానాన్ని గోరూపంలో దర్శించాలి.

ఈ గోవును ఎవ్వరు మేపాలి.

గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓

సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.

జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼

అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు.

ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.

ఏమిరా నాయనా‼ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.

ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓

అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.

ఈ జగన్మాత ఒక మంచి గురువును పంపకపోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.

వాడి ఆకలి తీరలేదు అంటే ఏమిటి అర్థం.

 వాడికి ఇంకా జ్ఞానం పొందే సమయం రాలేదు అని.

ఇంకో మాటలో చెప్పాలంటే వాడికి దైవానుగ్రహం కలుగలేదు అని అర్థం.

ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.

ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.

ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓

వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.

 సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.

 ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.

చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,

 మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.

ఈ చీమలు ఆరుబైట బారులు తీరి తిరుగుతూ కనబడతాయా❓
లేదు.

చీమలు ఎప్పుడూ పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓

మనిషికి ఉండే అజ్ఞానం ఒక పుట్ట.

రేపటి రోజును గురించి బంగారు కలలు కనడం మరోపుట్ట.

ఈ రెండు పుట్టలలో ఉన్న వాళ్ళని చేరదీసి, రక్షించడమే భగవంతుడికి తెలిసిన విద్య.

ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.

ఓం అన్నది మంత్రం కాదు,

*_📧ఓం.. ఓం... ఓం...._*

*🔸ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు,*
*🔹వేదాలలో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం.*
*🔸ప్రాచీన కాలంలో రుషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్య వంతులుగా ఉండటం వెనక ఓంకార నాదమే రహస్యం.*
*🔹విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనల్లో ఓంకారం మృత్యుంజయ జపం అని తేలింది.*
*🔸నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలక గలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది.*
*🔹ఓంకారం పదిహేను నిముషాల పాటు ఉచ్ఛరించ గలిగితే రక్తపోటు తగ్గుతుంది.*
*🔸రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.*
*🔹మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది.*
*🔸ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది.*
*🔹జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది.*
*🔸కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది.*
*🔹థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది.*
*🔸ఓంకారంలో ఉన్న మహత్యం అదే📧.*

ఓ మంచి కధ చదవండి..

ఓ మంచి కధ చదవండి..
**********************
ఓ యువకుడు ఓ మంచి ఉద్యోగం కోసం ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వూకు వెళ్ళాడు.

చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు............

చివరి పరీక్షకు డైరెక్టరు దగ్గరికి వెళ్ళాడు.

*డైరెక్టరు* : నీవు చదువుకునే రోజుల్లో ఏదైనా స్కాలర్షిప్ వచ్చిందా?

*యువకుడు*: లేదండీ! మా అమ్మ-నాన్నగార్లే అన్ని ఫీజులు కట్టేవారు.......

*డైరెక్టరు*: మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు?

*యువకుడు*: ఖాళీ-సిసాలు పాత-ఇనుము వేస్ట్-పేపర్ ప్లాసిటిక్-స్క్రాప్ - చిన్నచిన్న-వ్యాపారములు చేసి అదే పనిని వృ త్తిగా  మార్చుకొని నన్ను చదివించారు.......

*డైరెక్టరు*: అయితే నీ చేతులను ఒకసారి నాకు చూపించు.

*యువకుడు*: తన చేతులను చూపించాడు........
అవి చాలా సున్నితంగా నాజూకుగా సుతి-మెత్తగా   ఉన్నాయి.

*డైరెక్టరు*: నువ్వు ఎప్పుడైన నీ తల్లిదండ్రులకు వారు చేసే పనిలో  సహాయపడ్డావా?

*యువకుడు*: లేదండీ! వారు నన్ను కష్టపడనివ్వకుండా మంచిగా చదువుకునిమంచి ఉద్యోగం సంపాదించమని చెప్పేవారు.....నేను అలాగే చేశాను.

*డైరెక్టరు*: నిజంగా నువ్వు ఈ ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నావాడివి.

*డైరెక్టరు*: నాదొక చిన్నవిన్నపం.చేస్తాను అంటేనే చెపుతాను.

*యువకుడు*: తప్పకుండా చేస్తాను చెప్పండి సర్.

*డైరెక్టరు*: ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత మీ తల్లిదండ్రులకు మూడు-రోజులు విరామము ఇచ్చి.....
వారు చేసే పనిని నీవు సరిగ్గా మూడు-రోజులు చేసి.....రా! తప్పకుండా నువ్వు ఈ ఉద్యోగంలో చేరవచ్చు....

*యువకుడు*: అలాగే సర్. అని.. తల్లిదండ్రులకు సహాయపడటానికి వెళ్లి  వారిని చూడగానే విపరీతంగా ఏడ్చాడు.....
ఆ-చేతులు కాయలుగట్టి.........
కాళ్లకు-చేతులకు సీసాముక్కలు-ఇనుపసామాను ముక్కలు గుచ్చుకొని..రక్తం కారుతూ....... గరుకుగా.......చాలా ఘోరంగా కనపడ్డాయి......

ఆ చేతులలో తన మొహాన్ని పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు.....వారి కష్టాన్ని తలచుకుని వారు చేసే పనిని తానే అ మూడు రోజులు
తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో.... ఇష్టముతో.... కష్టపడి తన డైరెక్టరు పెట్టిన పరీక్షను పూర్తి చేసాడు.

మరుసటిరోజు ఆఫీసుకు కాళ్లకు-చేతులకు సీసపు ముక్కలు-ఇనుపసమాను ముక్కలు గుచ్చికున్న చోట డాక్టర్ వద్ద ప్రథమ చికిత్స చేయించు కొని   కళ్ళనీళ్ళతో వెళ్ళి ....
ఆ డైరెక్టరు పాదాలకు నమస్కరించాడు...."

మీరు నా కళ్ళు తెరిపించారు సర్!

నా తల్లిదండ్రుల కష్టాన్ని నాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.

మీరు నాకు ఈ ఉద్యోగాన్ని ఇస్తే వారిని కంటికి రెప్పలా ఏ లోటూ లేకుండా కాపాడుకుంటాను"

దానికి డైరెక్టరు ఇలా సమాధానం ఇచ్చారు......"

ఇంట్లో తల్లిదండ్రుల కష్టం తెలిసిన వారికే ఆఫీసులోని పై అధికారుల కష్టాలు అర్థంఅవుతాయి.......
కాబట్టి ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి ఉన్నవారికే మా-ఆఫీసులో ఉద్యోగాలు ఇవ్వాలని, నీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇలాంటిచిన్న పరీక్ష పెట్టడం జరిగింది...

నీవే ఈ ఉద్యోగానికి 100% అర్హుడవు.

*కాబట్టి డబ్బులు పెట్టి మనల్ని చదివిస్తున్నారుకదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా అసలు ఆ ఫీజుకు కట్టడానికి తల్లిదండ్రులు పడే కష్టాన్ని ఒక్కసారి తలచుకుని చక్కగాచదువుకుని ప్రయోజకులు కండి,,,*

ఆల్ ది బెస్ట్.............🌷🌹🌻
*ఈ కథ అందరి అమ్మ-నాన్నలకు అంకితం*..

నచ్చితే పాటించండి
మీ ఆత్మీయులకు పంపించండి