5, మార్చి 2018, సోమవారం

ప్రేమ అనే పదం లో....ప ర మ అనే అక్షరాల సమన్వయ శబ్దం

జయ శ్రీ మాతా!
ప్రేమ అనే పదం లో....ప ర మ అనే అక్షరాల సమన్వయ శబ్దం
వినిపిస్తుంది. అంటే ప్రాపంచికమైనది కాదు. కేవలం
ఆత్మ సంబంధం మాత్రమే. దీని అర్ధం జీవాత్మ-పరమాత్మను పొందటమే. అణువణువునా భగవంతుని దర్శించటమే .
అందరిలో దేవుని సేవించడమే.
యవ్వనంలోని ఆకర్షణ కాదిది.
లైంగిక సంపర్కం కానేకాదు.
షికార్లు తిరగడం అసలే కాదు.
ఒకర్నొకరు లోబరచుకోవటం/
సొంతం చేసుకోవాలని ఆరాటపడటం ససేమిరా కాదు.
ప్రేమ అంటే బంధం కాదు....
సంపూర్ణ స్వేచ్ఛ. ప్రేమ అనేది
కోరిక కాదు.....త్యాగం.
ప్రేమ అనేది మోహం కాదు...
మోక్షం. LIBERATION.
ప్రేమ అంటే 1+1 కాదు....
(1×1) ప్రేమ లో స్వార్థం లేదు.
అంతా పర హితార్థమే.
I ness కాదు 1 ( one)ness
ప్రేమ....పరమ ప్రేమ....
పరమ పవిత్రమైన పరమాత్మ ప్రేమ. ఇదేనా మనం చూస్తున్నది. ఇదేనా మనం
కోరుకుంటున్నది. ఈ ప్రేమలో
ఎడబాటు లేదు....విరహ వేదన
లేనే లేదు. అంతా 1(one)ness ...eternal bliss....God bless you all my dear friends.
Jaya Shree Matha.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి